ప్రేమలో పడడం.. గొప్ప విశేషం అనిపించుకోదు.. ఆ ప్రేమను విజయవంతం చేసుకోవడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. ఆ సంతోషంలోనే ఉన్నారు టాలీవుడ్ లవ్ బర్డ్స్ నాగచైతన్య, సమంత. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో లోకమంతా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జనవరి 29న నిశ్చితార్ధం జరుపుకున్న ఈ జంట వేసవిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ తమతమ షూటింగ్ ల్లో బిజీగా ఉన్నప్పటికీ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాదు తాము ఎలాగా ఎంజాయ్ చేస్తున్నామో ఆ విషయాన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు.
మొన్న గోవా, నిన్న ఢిల్లీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సమంత తాజాగా వేలంటైన్స్ డే నాటి ఫోటోని పోస్ట్ చేసింది. ప్రేమికుల రోజున చైతూకి సూపర్ గిఫ్ట్ ఇచ్చానని సమంత ఓ ఫోటోని ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలో నాగచైతన్యకు స్యామ్ నుదుటి మీద ముద్దుపెడుతోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యధిక లైక్లు అందుకుంటోంది. అభిమానులు “లవ్లీ కపుల్స్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.