Samantha: తన పెట్ తో బయటకి వెళ్ళిన సామ్.. ఎక్కడికో తెలుసా..?

సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా, దక్షిణాది, హిందీ ఇండస్ట్రీల్లోనూ సంచలనం సృష్టించింది. ఏకంగా బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్ వీరి విడాకులపై స్పందించారు. అదే సమయంలో ఓ హిందీ నటుడితో పరిచయం వల్లే నాగచైతన్య ఇలా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు మన దగ్గర సైతం సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణాలను వెతికే పనిలోనే వున్నారు నెటిజన్లు. మొన్నామధ్య సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌కు.. సామ్‌కి రిలేషన్ అంటకట్టి..

అతని వల్లే నాగచైతన్యను సమంత వదులుకుందంటూ గాసిప్ అల్లేశారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన సమంత.. తాను అబార్షన్స్ చేయించుకోలేదని, ఎవరితోనూ తనకు అఫైర్స్ లేవంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చింది. ఇంత వ్యవహారం నడుస్తున్న సమయంలో ఏ ఆడపడుచు అయినా కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ అక్కడ వుంది సమంత. గతం గత: అన్న సిద్ధాంతాన్ని నమ్ముతూ తిరిగి మామూలు మనిషి అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘‘ఎవరు మీలో కోటీశ్వరుడు’’ షోకు గెస్ట్‌గా వచ్చింది.

నిన్న దసరా సందర్భంగా సినిమాను సైతం అనౌన్స్ చేసింది. అంతేకాదు ఏకంగా పబ్లిక్‌లోకి సైతం సమంత వచ్చారు. ఇటీవల తన పెట్ డాగ్‌ను క్లినిక్‌కు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో సమంత తెలుపు రంగు చొక్కా.. లేత నీలం డెనిమ్ ప్యాంట్, ముఖానికి మాస్క్ ధరించారు.

1

2

3

4

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.