మనసులు మాత్రమే కాదు టాటూలు కూడా!

పెళ్లి పత్రిక ముద్రించడం ఒక్కటే మిగిలింది అన్నట్లుగా ఉంది నాగచైతన్య-సమంతల వ్యవహారం. గత మూడేళ్లుగా ప్రేమించుకొంటున్న వీరు ఈమధ్యనే పబ్లిక్ అయిపోయారు. అప్పట్నుంచి పబ్లిక్ గా తిరిగేస్తున్న వీరి మనసులతోపాటు తనువులు కూడా ఘాడంగా కలిసిపోయాయని అందుకే మొదట్లో వద్దన్న నాగార్జున కూడా చేసేదేం లేక ఓకే చెప్పేశాడని అప్పట్లో ఫిలిమ్ నగర్ వర్గాల్లో గుసగుస వినపడ్డాయి. మనసులు, తనువులు మాత్రమే కాక టాటూలు కూడా కలిసిపోయాయని తెలుస్తోంది.

ఇటీవల కేఫ్ బహార్ అనే రెస్టారెంట్ ను లాంచ్ చేయడానికి వచ్చిన సమంత చేతిపై రెండు ఐమూలక గీతలు కనిపించాయి. కొన్నాళ్ళ క్రితం నాగచైతన్య చేతిపై కూడా ఇదే తరహాలో టాటూ దర్శనమిచ్చింది. ఇద్దరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు యాక్సెప్ట్ చేశాక చైతూ-సమంతలు కావాలనే ఇలా టాటూ వేయించుకొన్నారేమో. వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అప్పటివరకూ వాళ్ళేం చేసినా విచిత్రంలానే అగుపిస్తుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus