విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి నవదంపతుల ఆలోచన.!

  • March 26, 2018 / 01:40 PM IST

యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకోగానే.. హనీమూన్ అంటూ నెలరోజుల పాటు రెస్ట్ తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఈ జంట మాత్రం అలా చేయలేదు. ఇద్దరూ తమతమ ప్రాజక్ట్స్ లో బిజీ అయ్యారు. సమంత మహానటి, రంగస్థలం, విశాల్ తో ఇరంబు తిరై అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసింది. మరో మూడు సినిమాలు చేస్తోంది. నాగచైతన్య కూడా అంతే.  చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే మారుతీ దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు.. మూవీ చేస్తున్నారు.

ఇలా పెళ్లి తర్వాత ఇద్దరూ కలవడానికి ఎక్కువ సమయం దొరకలేదు. అందుకే ఈ జంట కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైంది. ఇద్దరూ తమ షూటింగ్స్‌కి ఓ రెండు వారాలపాటు బ్రేక్ ఇచ్చి యూఎస్‌లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. రంగస్థలం ఈనెల 30 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొని విదేశాలకు వెళ్లాలని సమంత అనుకున్నట్టు తెలిసింది. తిరిగి వచ్చినప్పుడు ఇద్దరూ తమతమ ప్రాజక్ట్స్ తో బిజీ కావడమే కాకుండా.. ఇద్దరూ కలిసి నటించే మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus