తల్లి చేసిన పనిని గుర్తు చేసుకున్న సమంత

  • January 12, 2018 / 01:01 PM IST

అక్కినేని కోడలిగా అడుగు పెట్టిన తర్వాత సమంత మరింత ఉత్సాహంతో సెట్స్ కి వెళుతోంది. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా మారడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాదు జీ తెలుగు తెలుగు ఛానల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త బాధ్యతలు తీసుకుంది. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో తన చిన్ననాటి సంగతులను అభిమానులతో పంచుకుంది. “మా అమ్మ చర్చికి బలవంతంగా లాక్కెళ్లిన రోజులు గుర్తొచ్చాయి. వారంలో మూడు రోజులు.. బుధవారం, శనివారం, ఆదివారం తీసుకెళ్లేది. అప్పుడది అసలు నచ్చేదికాదు.. కానీ ఆమె ప్రార్థనలే నన్ను రక్షించాయి. నా అద్భుతమైన అమ్మ’ అని సమంత ట్వీట్‌ చేసింది. దీంతోపాటు చర్చి ముందు దిగిన ఫొటోను పంచుకుంది.

సమంత ప్రతి క్రిస్మస్ కి క్రిసమస్ ట్రీ ని తప్పకుండా ఏర్పాటు చేస్తుంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం సమంత తెలుగులో “రంగస్థలం”, ‘మహానటి’ సినిమాల్లో నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “రంగస్థలం”లో రామ్‌చరణ్‌ కి జోడిగా నటిస్తోంది. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌అశ్విన్‌ ‘మహానటి’లో అలనాటి నటి జమున పాత్రను సమంత పోషిస్తోంది. ఇవే కాకుండా తమిళంలో ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇవన్నీ ఈ ఏడాది వరుసగా రిలీజ్ కానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus