మహేష్ పక్కన అందంగా కనబడాలంటే ఎలా?

Advertisement

టాలీవుడ్ అందగాడు, సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఎంత అందమైన హీరోయిన్ అయినా నార్మల్ గా కనిపిస్తుంది. అయితే మహేష్ పక్కన సరి జోడిగా కనబడాలంటే ఏం చెయ్యాలో సమంత సలహా ఇచ్చింది. ఈ క్యూట్ హీరోయిన్ ప్రిన్స్ పక్కన మూడో సారి కలిసి నటించింది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండూ విజయం సాధించాయి. మూడో సినిమా బ్రహ్మోత్సవం కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమాగా చెబుతోంది ఈ భామ.

మహేష్ సింపుల్ డ్రస్ లు వేస్తుంటారు. అందులో అతను సూపర్ గా కనిపిస్తారు. మనం (హీరోయిన్లు ) కూడా హెవీ జువెలరీ లేకుండా, సింపుల్ డ్రస్సులు వేసుకుంటే సూపర్ స్టార్ పక్కన సూపర్ గా ఉంటామని చెప్పింది. “బ్రహ్మోత్సవం లో నేను మనసులో ఏమీ దాచుకోని అమ్మాయిగా నటించాను. ఈ సినిమాతో మేము హిట్ పెయిర్ అని మరోసారి నిరూపించుకుంటామ”ని మురిసి పోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus