బిగ్ బాస్4 : ఆడియన్స్ మనసు గెలిచావ్ అంతే..!

  • October 25, 2020 / 09:57 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ అవతారం ఎత్తిన సమంత దాదాపు 3.30 గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఒక పక్కన హౌస్ మేట్స్ ని డీల్ చేస్తూనే సెలబ్రిటీలని పరిచయం చేస్తూ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసింది. తన బ్యూటిఫుల్ స్మైల్ రేషియో ఎక్కడా కూడా తగ్గకుండా ఆడియన్స్ మనసులు గెలిచింది. సమంతా.. మా మనుసు దోచావ్ … మా మనసంతా నువ్వే అన్నట్లుగా యాంకరింగ్ చేసింది ఈ అక్కినేని వారి కోడలుపిల్ల.

నాగార్జున షోని లీడ్ తీస్కుని హౌస్ మేట్స్ కి సమంతని ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర్నుంచీ ఎక్కడా కూడా ఎంటర్ టైన్మెంట్ ని మిస్ చేయలేదు. అవినాష్ తో పంచ్ లు, అభిజిత్ తో ఫన్, అఖిల్ మోనాల్ తో ఎంటర్ టైన్మెంట్ ఇలా అందర్నీ పలకరిస్తూ మెప్పించింది. అంతేకాదు, ఎలిమినేషన్ ఎపిసోడ్ ని కూడా చాలా కూల్ గా డీల్ చేసింది.ఎక్కడా కూడా తడబడకుండా.. చక్కగా అందంగా షోని నడిపించింది.

నిజానికి తెలుగు రాని సమంత షోని ఎలా లీడ్ చేస్తుంది అనే విమర్శలు చాలా వినిపించాయి. వాటన్నింటికీ తన యాంకరింగ్ తోనే సమాధానం చెఫ్పింది. ఇక అఖిల్ వచ్చినపుడు ఆది వచ్చినపుడు చేసిన ఫన్ ఎపిసోడ్ కే హైలెట్ అని చెప్పాలి. పాయల్ రాజ్ పుత్ , కార్తికేయ ఇచ్చిన పెర్ఫామెన్స్ , గీతామాధురి – శ్రావణభార్గవి పాడిన పాటలతో పండగ ఎపిసోడ్ తో బిగ్ బాస్ స్టేజ్ దద్దరిల్లిపోయింది. మూడూన్నర గంటలపాటు అస్సలు బోర్ కొట్టకుండా ఎపిసోడ్ ని డీల్ చేయడంలో సమంత హౌస్ మేట్స్ మనసులనే కాదు.. ఆడియన్స్ హృదయాలని కూడా గెలుచుకుంది. అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus