డైరెక్టర్‌కు ఐ లవ్ యూ చెప్పిన సమంత

  • October 30, 2018 / 08:10 AM IST

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత పెళ్లి అయిన తర్వాత మరింత ఉత్సాహంతో దూసుకుపోతోంది. రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తమిళంలోనూ మంచి విజయాన్ని కైవశం చేసుకుంది. రీసెంట్ గా యూటర్న్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సత్తా చాటింది. ఆ విజయాన్ని భర్తతో కలిసి ఎంజాయ్ చేసింది. ఇప్పుడు భర్తతో కలిసి మజిలీ అనే మూవీ చేస్తోంది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే సమంత తాజాగా తన అభిమాన డైరక్టర్ కి “ఐ లవ్ యూ” చెప్పింది.

సమంత గత చిత్రం “యూటర్న్” ని తెరకెక్కించిన పవన్ కుమార్ సోమవారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా ద్వారా పవన్‌ కుమార్‌కు శుభాకాంక్షలు చెప్పింది. “పవన్ కుమార్‌.. నేనెప్పటికీ నీ అభిమానినే. దర్శకుడిగా నువ్వంటే చాలా ఇష్టం. విడుదలైన నీ ప్రతీ సినిమా చూస్తా. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. నీతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఐ లవ్యూ మై ఫ్రెండ్” అని విష్ చేసింది. సమంత ఇష్టం చూస్తుంటే మరో సినిమా అతని దర్శకత్వంలో చేసేలా అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus