‘ఆడై’ టీజర్ పై సమంత షాకింగ్ కామెంట్స్?

  • June 19, 2019 / 12:37 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’, నాగ చైతన్య తో ‘బెజవాడ’, నాని తో ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాలతో వంటి చిత్రాలతో టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్. ఇక అమలా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆడై’. రత్న కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో “ఆమె” పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమా పై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ … తాజాగా విడుదల చేసిన టీజర్ తో అంచనాలు మరింత పెంచేశారు.

ఈ టీజర్ లో ఓ షాట్లో పూర్తిగా నగ్నంగా కనిపించి అమలాపాల్ ప్రేక్షకులకు షాకిచ్చింది. కేవలం పాత్ర డిమాండ్ చేసినందుకే ఇంత బోల్డ్ గా కనిపించింది అమల. ఈ రీతిగా తాను ఎటువంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకుంది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండే కాదు సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ లిస్ట్ లో అక్కినేని సమంత కూడా ఉంది. ” ‘ఆడై’ టీజర్ ప్రేక్షకులకు అత్యంత ఉత్కంఠత కలింగించేలా, అద్భుతంగా ఉంది, బెస్ట్ విషెస్ టు అమలాపాల్, సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది సమంత.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus