ఏ మాయ చేసిందేమో గాని సమంత .. వరుసగా కుర్ర హీరోలందరితో నటించే అవకాశం దక్కించుకుంటోంది. ఏమని దర్శకులను అడిగితే ఆమెతో మా హీరో కెమిస్ట్రీ బాగుంటుందని చెబుతున్నారు. హీరోలని అడిగితే సమంత మంచి నటి, అంతే కాదు మా జోడీ స్క్రీన్ పైన అందంగా ఉంటుందని కితాబు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె ముందు ఉంచితే .. క్రెడిట్ అంతా హీరోలదే అని సెలవిచ్చింది… తనతో నటించిన హీరోల గురించి సమంత చెప్పిన సంగతులు..
కామ్ గా ఉండే వారు..నా తొలి హీరో నాగ చైతన్య. “ఏ మాయ చేసావే” ముందు ఆయనకు కెమెరా అనుభవం ఉంది. నాకేమో కొత్త. అప్పుడు తెలుగు కూడా రాదు. అయినా ఓపికగా భరించారు. ఓ గొప్ప సినీ కుటుంబం నుంచి వచ్చినా .. సెట్లో కామ్ గా ఉండేవారు. సీన్ అయిపోగానే .. ఒంటరిగా కూర్చొని తన పని తాను చూసుకునే వారు.
(సమంత నాగ చైతన్యతో ఏ మాయ చేసావే సినిమాతో పాటు ఆటోనగర్ సూర్య, మనం లో నటించింది.)
డాన్స్ సూపర్ఎన్టీఆర్ పక్కన బృందావనం లో నటించే అవకాశం రాగానే నేను వెంటనే ఆయన నటించిన గత సినిమాలన్నీ చూశాను. వామ్మో .. ఏమి జోరు అనిపించింది. సెట్లోనూ అంతే ఉత్సాహంతో పని చేసేవారు. చిన్న సీన్ అయినా సరే.. వంద శాతం కృషి పెడతారు. ఆయన డాన్స్ చేస్తుంటే .. చాల సార్లు నా స్టెప్పు మరిచి పోయేదాన్ని.
(ఎన్టీఆర్ సరసన రామయ్య వస్తావయ్య, రభస సినిమాల్లో నటించారు. జనతా గ్యారేజ్ లో నటిస్తున్నారు)
జోకులు వేస్తారు..మహేష్ సైలంట్ గానే జోకులు వేస్తారు. దూకుడు లో నేనూ, మహేష్ గొడవపడే సీన్లున్నాయి. అక్కడ నేను చాలా సీరియస్ గా కనిపించాలి. కాని మహేష్ ని చూస్తే నవ్వు ఆగేది కాదు. ఇలా అయన సెట్లో ఉంటే నాకు సమయమే తెలియదు. మా ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండుతుంది. అందుకే మహేష్ తో మూడు(దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం) సినిమాలు చేయగలిగా.
నాని కమిట్ మెంట్ నచ్చింది..నేను ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో నాని తో కలిసి నటించా. నానిలో చాలా టాలెంట్ ఉంది. అతని కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. షూటింగ్ స్పాట్ లో ఆరోజు తీయాల్సిన షాట్ గురించి మాత్రమే మాట్లాడేవాడు.
మాటలతో కట్టి పడేస్తాడు..సినిమా, ఇల్లు.. ఈ రెండే సిద్దార్ధ కి తెలిసినవి. నేను జబర్దస్త్ సినిమా కోసం అతనితో కలిసి నటిస్తున్నప్పుడు ఈ సంగతి తెలుసుకున్నాను. సినిమా లేకపోతే కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తాడు. నేనూ అంతే. ఆ విషయంలో మాఇద్దరిది సేమ్ పించ్. సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా సుధీర్గంగా మాట్లాడేస్తాడు. అతని ఆలోచనలెప్పుడూ వినూత్నంగా ఉంటాయి. తన మాటలతో ఎదుటివారిని కట్టి పడేస్తాడు.
పవర్ ఫుల్ మాన్పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ మాన్. దేనికి భయపడరు. అత్తారింటికి దారేది విడుదలకు ముందే బయటకు వచ్చినా కంగారు పడలేదు. మాకందరికీ ధైర్యం చెప్పారు. ఆయన కెమేరా ముందే నటిస్తారు. బయట కాదు.