సమంత హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా…!

  • July 22, 2019 / 02:58 PM IST

తమిళంలో ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది ’96’ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ రీమేక్ లో విజయ్ సేతుపతి ప్లేస్లో శర్వానంద్.. త్రిష ప్లేస్ లో సమంత నటిస్తుంది. ’96’ ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు తమిళ ’96’ కు మ్యూజిక్ అందించిన గోవింద్ వసంత తెలుగులో కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండీ సమంత లుక్ లీకైంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరుగుతుంది. ఇక్కడ మైక్ పట్టుకుని ట్రెడిషనల్ లుక్ లో ఉన్న సమంత ఫోటోలు బయటకి వచ్చాయి. అలా ఈ ఫోటోలు లీకయ్యాయో లేదో.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈమద్యే ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ‘ఓ బేబీ’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లందుకున్న  ఈ సమంత ’96’ రీమేక్ తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus