పెళ్లి తర్వాత ఎలా ఉండాలో చెప్పిన వారికి సమంత వార్నింగ్

  • September 27, 2018 / 11:41 AM IST

సినిమాల్లో అనేక పాత్రల్లో సమంతని చూసాం. రియల్ లైఫ్ లోను ఆమె ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమాలో హీరో ఏమైనా అంటే బుంగమూతి పెట్టే సమంత.. రియల్ లైఫ్ లో ఎవరైనా విమర్శిస్తే మాత్రం అలగలేదు. బాధపడలేదు. తనని విమర్శించిన వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమంత నటించిన యూ టర్న్, నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు విజయం సాధించడంతో ఇద్దరూ కలిసి విహారానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. తమ టూర్ కి సంబంధించిన ఫోటోలను సమంత నిన్న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు విమర్శలు వచ్చాయి. “ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోవడం మాకు నచ్చడం లేదు. దయచేసి మరోసారి ఇలాంటి ఫోటోలు పోస్టు చేయకండి”… “నీకు పెళ్లయింది… నీపై గౌరవం ఉంది… దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు” “ఈ ఫోటో చాలా చండాలంగా ఉంది, ఇలాంటి ఫోటోల్లో నిన్ను చూడాలనుకోవడం లేదు, వెంటనే ఈ ఫోటో తీసేయ్” అంటూ ఆర్డర్ వేశారు.

ఈ మాటలకూ సమంత కోపం వచ్చింది. “పెళ్లి అయిన తర్వాత నేను ఎలా ఉండాలో మీ దగ్గర నేర్చుకోనవసరం లేదు” అంటూ మిడిల్ ఫింగర్ చూపించింది. ఇలా వార్నింగ్ చేయడం సంచనం అయింది. అందుకు విద్యులేఖ రామన్ వంటి నటీమణులు సమంతకి మద్దతు పలుకుతున్నారు. “పెళ్లి అయిన అమ్మాయి అంతా కప్పుకొని ఉండాలనే మైండ్ తో ఉన్నవారికి బాగా బుద్ధి చెప్పావు. అలాగే సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఇలా ఉండాలనే గీతాలను తుడిపేసావు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు” అంటూ సమంతని సమర్ధించింది. సమంత తీరు ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus