సమంత అభిమానులకు సందడే సందడి!

  • August 4, 2018 / 10:26 AM IST

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత పెళ్లి అయిన మరింత ఉత్సాహంతో దూసుకు పోతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ద్వితీయార్ధంలోనూ మూడు సినిమాలతో పలకరించరుంది. అయితే ఇందులో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం విశేషం. సమంత తన ఇమేజ్ ని పక్కన పెట్టి అతి తక్కువ బడ్జెట్ లో చేసిన మూవీ యూ టర్న్. ఇందులో సమంత లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళంలోను రూపుదిద్దుకుంటోంది. ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక తమిళంలో సమంత చేస్తున్న రెండు సినిమాల్లో “సీమ రాజా” ఒకటి. శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి పొన్ రామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తమిళనాడులో సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విధంగా ఒకే రోజున సమంత రెండు సినిమాలతో తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. సీమారాజా కి తెలుగు డబ్బింగ్ పనులు పూర్తి అయితే ఇక్కడ కూడా రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంది. ఆ రిలీజ్ టెన్షన్ ఉన్నప్పటికీ సమంత.. ఆ ఒత్తిడిని పక్కన పెట్టి భర్త నాగ చైతన్యతో కలిసి మూవీ చేయడానికి సిద్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus