చైతూ సమంత సేమ్ టు సేమ్..!!

  • August 17, 2016 / 06:56 AM IST

టాలీవుడ్ ప్రేమ పక్షులు చైతూ, సమంత మరో సారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కలిసి జీవిస్తున్న వారు మీడియాకు చిక్కకుండా ఎంత ప్రయత్నిస్తున్నా ఎదో రూపంలో దొరికి పోతున్నారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కొన్ని రోజుల క్రితం తన కుడి చేతి మణి కట్టు వద్ద “ప్లే” అనే సింబల్ ను టాటూ వేయించుకున్నారు. అదే సింబల్ ఇప్పుడు స్యామ్ మణికట్టు మీద ప్రత్యక్షమైంది.

రీసెంట్ గా ఆమె ఫోటోలు పరిశీలిస్తే ఈ విషయం బయట పడింది. ఇంకేముంది  చైతూ సమంత సేమ్ టు సేమ్  అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేక పోతున్న ఈ ప్రేమపక్షులు డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అందు కోసమే సమంత ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఆమె నటించిన జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 2 న రిలీజ్ కానుంది. చైతు కూడా తన ప్రేమమ్ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం యువ సామ్రాట్ పెళ్లి కొడుకు కానున్నట్లు ఫిలిం నగర్ సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus