అవకాశాల కోసం హాట్ ఫోటోషూట్స్ చేయించుకుంటోంది

  • June 4, 2018 / 01:11 PM IST

పాపం టాలీవుడ్ మీద బోలెడు ఆశలు పెట్టుకొని సాండల్ వుడ్ లో వచ్చిన ఆఫర్స్ అన్నిట్నీ కాదనుకొని ఇక్కడకి వచ్చింది సంయుక్త హెగ్డే. నిఖిల్ సరసన “కిర్రాక్ పార్టీ” సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మంచి డ్యాన్సర్ కూడా. అయితే… కిరాక్ పార్టీ అసలు ఎప్పుడు విడుదలైందో కూడా తెలియకుండా థియేటర్ల నుంచి వెళ్లిపోవడంతో అమ్మడికి ఆశించినంత పేరు కాదు కదా కనీసం గుర్తింపు కూడా రాలేదు. అందుకే అమ్మడు అర్జెంట్ గా ఒక హాట్ హాట్ ఫోటోషూట్ చేయించుకొని మీడియాకి వదిలింది. అందాల ప్రదర్శనకు ఎప్పుడూ అడ్డుచెప్పని సంయుక్త ఈ సరికొత్త ఫోటోల్లో అందాలను చాలా ఉదారంగా ఆరబోసింది.

మరి అమ్మడు అడ్డు చెప్పకుండా ప్రదర్శించిన అందాలను చూసైనా మన తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను హీరోయిన్ గా ఎంకరేజ్ చేస్తారో లేదో చూడాలి. అయితే.. అమ్మడు మాత్రం ఏమాత్రం నిరాశపడకుండా ఇంకో రెండుమూడు సెషన్ల ఫోటోషూట్స్ కోసం సిద్ధమవుతోంది. మరి అమ్మాయిగారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus