మహేష్ బాబుని విభిన్నంగా చూపించనున్న సందీప్ రెడ్డి

  • February 17, 2018 / 08:09 AM IST

ప్రేమ కథలను సున్నితంగానే కాదు.. విభిన్నంగాను చూపించవచ్చని అర్జున్ రెడ్డి సినిమా ద్వారా డైరక్టర్ సందీప్ రెడ్డి నిరూపించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ వివాదాల మీదుగా విజయతీరాన్ని చేరింది. విమర్శలను అధిగమించి అవార్డులను అందుకుంది. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులనే కాదు సినీ ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. రిలీజైన సమయంలో రాజమౌళి, వర్మ అర్జున్ రెడ్డిపై అభినందనలు కురిపించారు. టాలీవుడ్ కథలకు కొత్త దారిని చూపించారంటూ ప్రశంసించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని అభినందనతో పాటు అవకాశం ఇచ్చారు. మంచి కథతో వస్తే నటిస్తానని సందీప్ రెడ్డి కి మాట ఇచ్చారు.

అందుకే సందీప్ ఓ చక్కని స్టోరీ లైన్ ని వినిపించడం, దానికి మహేష్ ఒకే చెప్పడం కూడా జరిగిపోయాయి. ఇందులో మహేష్ రోల్ బయటికి వచ్చింది. ఒక మెకానిక్ గా మహేష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ రోల్ మాస్ కి బాగా కనెక్ట్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డిని హిందీలో చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు .. మహేష్ స్క్రిప్ట్ ని కూడా ఓ కొలిక్కి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. హిందీ అర్జున్ రెడ్డి కంప్లీట్ కాగానే మహేష్ మూవీ మొదలవుతుంది. అప్పటిలోపున మహేష్ భరత్ అనే నేను సినిమాతో పాటు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమాని కూడా కంప్లీట్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus