విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటేష్ నుండి ఫ్యామిలీ ఓ ఫ్యామిలీ సినిమా వస్తుందంటే.. బాక్సాఫీస్ వద్ద దానికి తిరుగుండదు అనే చెప్పాలి. ఒకవేళ అదే సినిమా సంక్రాంతి టైమ్లో రిలీజ్ అయ్యింది అంటే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి వంటి దర్శకులు వెంకటేష్ తో సినిమా చేస్తే.. ఎక్కువ శాతం సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేది ఇందుకే.
అయితే వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతి'(Sankranthi) అనే సినిమా వచ్చింది. ‘తాజ్ మహాల్’ ‘రాజా’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ముప్పలనేని శివ దీనికి దర్శకుడు. వెంకటేష్ తో పాటు శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ వంటి హీరోలు కూడా ఈ సినిమాలో నటించారు. వెంకటేష్ సరసన స్నేహ, ఆర్తి అగర్వాల్.. శ్రీకాంత్ సరసన సంగీత, శివబాలాజీ సరసన రతి వంటి వాళ్ళు హీరోయిన్లుగా నటించారు.
కొన్ని కారణాల వల్ల ఈ సినిమా 2005 సంక్రాంతి సీజన్లో కాకుండా.. ఫిబ్రవరి 18న విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 యేళ్ళు పూర్తికావస్తున్న నేపధ్యంలో ఒకసారి.. ‘సంక్రాంతి’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి:
| నైజాం | 4.82 cr |
| సీడెడ్ | 3.25 cr |
| ఉత్తరాంధ్ర | 1.71 cr |
| ఈస్ట్ | 1.06 cr |
| వెస్ట్ | 0.88 cr |
| గుంటూరు | 1.05 cr |
| కృష్ణా | 1.15 cr |
| నెల్లూరు | 0.73 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.65 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.68 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 16.3 cr(షేర్) |
‘సంక్రాంతి’ సినిమా రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.16.3 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.3 కోట్ల లాభాలు అందించి సూపర్ హిట్ గా నిలిచింది.