విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)..ల కలయికలో రూపొందిన మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా.3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు 9 రోజుల్లో రూ.115 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. రూ.70 కోట్ల వరకు లాభాలు అందించింది.
ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 30.64 cr |
సీడెడ్ | 14.07 cr |
ఉత్తరాంధ్ర | 15.62 cr |
ఈస్ట్ | 11.26 cr |
వెస్ట్ | 7.04 cr |
కృష్ణా | 7.90 cr |
గుంటూరు | 8.65 cr |
నెల్లూరు | 3.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 98.88 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.25 cr |
ఓవర్సీస్ | 13.06 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 118.19 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 10 రోజుల్లో రూ.118.19 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.77.19 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. రెండో వీకెండ్ ను కూడా ఈ సినిమా భారీగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.