Sara Ali Khan: సారా అలీ ఖాన్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా.. అలా చేయడంతో?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సారా అలీ ఖాన్ (Sara Ali Khan) వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. హీరోయిన్ గా భారీ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తను చేసిన మంచి పని ద్వారా వార్తల్లో నిలిచారు. హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ సరిపోదని అందం ఉండాలని ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది. బొద్దుగా ఉంటే సినిమాల్లో ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించలేరు. సారా అలీ ఖాన్ బరువు తగ్గించుకుని సన్నబడటంతో పాటు తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చేసుకున్నారు.

హీరోయిన్ గా కూడా ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సారా అలీ ఖాన్ మర్డర్ ముబారక్, ఏ వాతా మేరే వాతా ప్రాజెక్ట్ లలో నటించారు. ముంబైలోని జుహులో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి వెళ్లిన సారా అలీ ఖాన్ బయట ఉన్న యాచకులకు స్వీట్స్, ఫుడ్ పంచారు. సెలబ్రిటీ స్టేటస్ ను కలిగి ఉన్న సారా అలీ ఖాన్ కు ఫుడ్ పంచాల్సిన అవసరం లేకపోయినా ఆమె మాత్రం జాలి, దయ, కరుణతో యాచకుల విషయంలో ప్రేమగా మెలిగారు.

సారా అలీ ఖాన్ స్వీట్ బాక్స్ లు పంచిన ఫోటోలను నెట్టింట షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీడియా ఫోటోలు తీయడంపై సారా అలీ ఖాన్ వాళ్లపై ఫైర్ కావడం గమనార్హం. సారా అలీ ఖాన్ ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే సినిమాలో నటిస్తున్నారు. సారా అలీ ఖాన్ ఫుడ్ డొనేషన్ వీడియోకు 1,20,000 లైక్స్ వచ్చాయి.

మీడియాను బ్రతిమాలి బ్రతిమాలి అలసిపోయానని మీరు మాత్రం మారడం లేదని ఆమె పేర్కొన్నారు. స్వీట్ బాక్స్ లు పంచిన తర్వాత విసుగుగా ఆమె కారెక్కి వెళ్లిపోయారు. సారా అలీ ఖాన్ లాంటి హీరోయిన్లు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus