Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

కార్తీ తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు అతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. తమిళంలో కార్తీ నటించే ప్రతి సినిమా.. సేమ్ డేట్ కి తెలుగులో కూడా డబ్ అవుతుంటుంది. ‘ఖైదీ’ ‘సర్దార్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ‘సత్యం సుందరం’ కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ‘సర్దార్’ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. వారు చెప్పినట్టు గానే సీక్వెల్ ని తీసి ఈ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Sardar 2

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ‘సర్దార్’ చిత్రాన్ని రిలీజ్ చేసింది కూడా ఈ సంస్థే. దీంతో ‘సర్దార్ 2′(Sardar 2) పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా సొ సొగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే

నైజాం  0.42 cr
సీడెడ్  0.11 cr
ఆంధ్ర(టోటల్)  0.38 cr
ఏపి+ తెలంగాణ  0.91 cr(షేర్)

‘సర్దార్ 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఆల్మోస్ట్ రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్ల.. కేవలం రూ.0.91 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.09 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus