Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కార్తి (Hero)
  • ఆషికా రంగనాథ్, మాళవిక మోహన్ (Heroine)
  • ఎస్ జె సూర్య, యోగిబాబు, రజిష విజయన్, ఆశిష్ విద్యార్థి తదితరులు (Cast)
  • పిఎస్ మిత్రన్ (Director)
  • ఎస్ లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా (Producer)
  • సామ్ సి ఎస్ (Music)
  • జార్జ్ సి విలియమ్స్ (Cinematography)
  • విజయ్ వేలుకుట్టి (Editor)
  • Release Date : 10th సెప్టెంబర్ 2026
  • ప్రిన్స్ పిక్చర్స్ (Banner)

తమిళ హీరో కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమా సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ‘సర్దార్’ సక్సెస్ఫుల్ మూవీ. దాదాపు 4 ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్ గా ‘సర్దార్ 2’ (Sardar 2) వచ్చింది. క్రేజీ సీక్వెల్ అయినప్పటికీ ఎందుకో దీనిపై బజ్ ఏర్పడలేదు. మూవీ టీమ్ తెలుగులో అగ్రెసివ్ గా ప్రమోషన్ చేసింది కూడా లేదు. మంచు మనోజ్ తో ఒక కామన్ ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి సరిపెట్టారు. ఈ క్రమంలో కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘సర్దార్ 2’ (Sardar 2). మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? నొప్పించిందా? తెలుసుకుందాం రండి:

Sardar 2 Movie Review

కథ: సీనియర్ ‘రా’ (RAW) ఏజెంట్ వాల్రస్ (అచ్యుత్ కుమార్) అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోవడంతో, అతని కోసం ఇండియన్ రా బృందం తీవ్రంగా గాలిస్తుంటుంది. అతన్ని పట్టుకునే క్రమంలో ఏర్పాటు చేసిన ఓ అండర్‌కవర్ ఆపరేషన్‌లో తన పైఅధికారికి (ఆశిష్ విద్యార్థి) తెలియకుండా ఇన్వాల్వ్ అవుతాడు కింది స్థాయి రా ఏజెంట్ అయిన విజయ్ (Karthi). వాల్రస్‌ని పట్టుకునే క్రమంలో అతనికి ఫైజా (Ashika Ranganath) తారసపడుతుంది. వారిద్దరినీ విజయ్ పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అనుకోకుండా ఓ టెర్రరిస్ట్ వాల్రస్‌ను, ఫైజాను చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఇందులో భాగంగా చోటుచేసుకున్న ఘర్షణలో వాల్రస్ మరణిస్తాడు. పై అధికారి పర్మిషన్ లేకుండా అండర్‌కవర్ ఆపరేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి, దానిని డిస్టర్బ్ చేసినందుకు గాను విజయ్ మరియు అతని టీమ్‌పై ఎంక్వైరీ కమిషన్ వేస్తారు.

అయితే వాల్రస్ చనిపోయే ముందు విజయ్‌ని చూసి అతన్ని ‘సర్దార్’ అనుకుంటాడు. దీంతో అతనికి కత్తి ఆకారంలో ఉన్న ఒక ‘కీ’ ఇస్తాడు. మరోవైపు, ఇంకో సీనియర్ రా ఏజెంట్ అయిన జారా (మాళవిక మోహనన్) బాంబ్ బ్లాస్ట్‌లో మరణించినట్టు ఆమె కూతురు ఫైజా కన్ఫర్మ్ చేస్తుంది. అయితే చనిపోయే ముందు ఫైజాకి ఓ గిఫ్ట్ బాక్స్ పంపుతుంది జారా. ఆ గిఫ్ట్ బాక్స్‌ను ఆధారం చేసుకుని మరో కీని సంపాదిస్తాడు విజయ్. ఈ విషయం తెలుసుకున్న ‘బ్లాక్ డాగ్’ యోగి (S. J. Suryah).. విజయ్, జారాలను చంపడానికి ప్రయత్నిస్తాడు. విజయ్, జారాలతో యోగికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అతని లక్ష్యం ఏంటి? ఆపరేషన్ డోకు(DOKU) ఏంటి? అసలు సర్దార్ బ్రతికున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు: కార్తీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ముంది. చాలా మంచి పెర్ఫార్మర్ అలాగే నేచురల్ పెర్ఫార్మర్ కూడా..! అందుకే అతని నటనకి ఎవ్వరైనా ఆకర్షితులవుతారు. కాకపోతే ఈ సినిమాలో కార్తీ పోషించిన 2 పాత్రలకి సరైన లాజిక్స్ ఉండవు. ముఖ్యంగా విజయ్ పాత్రని మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ గా చూపించారు. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి అతను రా ఏజెంట్ అయిపోయాడు. అది ఎలా సాధ్యమైంది? అనే విషయంలో ప్రాపర్ లాజిక్ ఉండదు.

తండ్రి పాత్రలో కార్తీకి మేకప్ సెట్ అవ్వలేదు. అలాగే డబ్బింగ్ కూడా..! మరోవైపు ఆషిక రంగనాథ్ క్యారెక్టర్ కి కూడా డెప్త్ లేదు. మాళవిక మోహనన్ రోల్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఆమె బాగా చేసింది. అయితే పార్ట్ 1 లో రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్. సెకండ్ పార్ట్ లో ఆమె పాత్ర ఏమైపోయిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రజీషా విజయన్ కనిపించేది కాసేపే అయినా బాగానే చేసింది. యోగి బాబు కామిడీ ఫోర్స్డ్ గా ఉంది. ఎస్ జె సూర్య విలనిజం బాగుంది. కొన్ని చోట్ల అతను సీరియస్ గా ఉన్నా నవ్వించగలిగాడు. కాకపోతే కొన్ని చోట్ల గట్టిగా అరుస్తాడు. కొన్ని డైలాగులు కూడా అర్ధం కావు. మిగతా నటీనటులు ఓకె.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ మధ్య స్పై యాక్షన్ సినిమాలకి డిమాండ్ పెరిగింది. బాలీవుడ్లో చాలా స్పై సినిమాలు వచ్చాయి. ‘దురంధర్’ ‘దురంధర్ 2’ వంటి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్.. అందరూ చూశారు. సౌత్ లో ‘స్పై’ సినిమాలు వర్కౌట్ కావు అనుకున్న టైంలో ‘సర్దార్’ వచ్చింది. మంచి సక్సెస్ అందుకుని ఆ స్టేట్మెంట్లు తప్పని ప్రూవ్ చేసింది. ‘సర్దార్’ లో కేవలం స్పై ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు.. డైరెక్టర్ మిత్రన్ టచ్ చేసిన సోషల్ ఎలిమెంట్ కూడా వర్కౌట్ అయ్యింది.

వన్ లైన్ వన్ పైప్ అంటూ వాటర్ బాటిల్స్ కొనాలంటేనే జనాలు భయపడేలా ‘సర్దార్’ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మిత్రన్. కానీ ‘సర్దార్ 2’ (Sardar 2) కి వచ్చేసరికి అతను బర్డెన్ ఎక్కువ పెట్టేసుకున్నాడు. ‘సర్దార్ 2’ స్పై ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫె ఫుల్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ బాగానే ఉంది. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి ఎస్ జె సూర్య విలనిజం కోసం రాసుకున్న ట్రాకులు హెవీ అయ్యాయి. అలాగే యాక్షన్ డోస్ కూడా పెరిగింది.

సింపుల్ గా ఉండాల్సిన క్లైమాక్స్ ని చాలా లెంగ్తీగా చేశాడు దర్శకుడు. యోగి బాబు, ఎస్ జె సూర్య మధ్య వచ్చే కామెడీ సీన్ ఫోర్స్డ్ గా ఉంది. ల్యాగ్ అనే ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. క్లైమాక్స్ కూడా అంతే..! సెకండాఫ్ విషయంలో శ్రద్ద వహించి ఉంటే.. సీక్వెల్ క్రేజ్ ఎంతో కొంత ఉంది కాబట్టి ఆడియన్స్ పాస్ మార్కులు వేసేసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపొయింది. సినిమాలో పాటలు లేకపోవడం మేజర్ ప్లస్ పాయింట్. కానీ స్పై సినిమాల మూడ్ కి అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో సామ్ సి ఎస్ కూడా ట్రాక్ తప్పాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. రన్ టైం దాదాపు 3 గంటలు ఉండటం కూడా ఆడియన్స్ కి భారంగా అనిపిస్తుంది.

విశ్లేషణ: ‘సర్దార్ 2’ (Sardar 2) ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. చాలా వరకు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ సెకండాఫ్లో వచ్చే విలన్ ట్రాక్, యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి ఆడియన్స్ కి భారంగా అనిపిస్తాయి.

ఫోకస్ పాయింట్: ఆపరేషన్ ‘డోకు’ ఫెయిల్

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus