Sarkaru Vaari Paata: తమన్ స్టైల్ సాగే మాస్ బీట్.. మాస్ ఆడియెన్స్ కు ఊపు ఇచ్చేలా..!

Advertisement

మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. మే 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నటితో షూటింగ్ మొత్తం పూర్తయింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్ర ఖని వంటి వారు కూడా డబ్బింగ్ కంప్లీట్ చేశారు.

Click Here To Watch NOW

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రం నుండీ టైటిల్ సాంగ్ ను విడుదల చేసారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వి విడుదల చేసినప్పుడు ఉన్న బీట్ తోనే ఈ పాట మొదలైంది. సరా సరా సరా సరా సర్కారు వారి పాట, షురూ షురూ అన్నాడు రా అల్లూరి వారి బేట అంటూ ఈ పాట సాగింది.

సంగీత దర్శకుడు తమన్ స్టైల్ మాస్ బీట్ ఇది. మాస్ ఆడియెన్స్ కు వెంటనే క్యాచీగా అనిపిస్తుంది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ బాగున్నాయి.హారిక నారాయణ ఈ పాటని ఎంతో ఎనర్జీ తో పాడింది. మాస్ కు మంచి ఊపు ఇచ్చేలా ఈ పాట ఉంది. క్లాస్ ఆడియన్స్ కు అయితే వెంటనే ఎక్కక పోవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus