జెర్సీ సినిమాలో క్రికెట్ కోచ్ గా సత్యరాజ్

  • October 15, 2018 / 01:00 PM IST

“బాహుబలి” చిత్రానికి ముందు కూడా సత్యరాజ్ తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసినప్పటికీ “బాహుబలి” చిత్రంలో చేసిన కట్టప్ప పాత్ర ద్వారానే ఎక్కువమందికి చేరువయ్యాడు సత్యరాజ్. ఆ సినిమా తర్వాత ఆయన స్టార్ డమ్ తోపాటు క్రేజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకడు. ఆయన డెసిషన్ మేకింగ్ మీద ప్రేక్షకులకు కూడా మంచి అభిప్రాయం ఉండడంతో.. సత్యరాజ్ సదరు సినిమాలో ఉన్నాడు అంటే ఆ సినిమాలో మినిమమ్ కంటెంట్ తప్పకుండా ఉంటుందని నమ్మకం. తాజాగా సత్యరాజ్ “జెర్సీ” సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నాడు.

“మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా “జెర్సీ” అనే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని ఒక సీనియర్ క్రికెటర్ గా నటిస్తుండగా.. నానికి కోచింగ్ ఇచ్చే సీనియర్ మోస్ట్ క్రికెటర్ పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నాడట. యూనివర్సెల్ అప్పీల్ ఉన్న సబెజ్ట్ కావడంతో అన్నీ భాషల వారికి రీచ్ అవ్వాలన్న ధ్యేయంతో ఇలా తెలుగు, తమిళ, మలయాళ ఆర్టిస్టులను ఎంపిక చేసుకొంటున్నారంట. చూస్తుంటే నాని & టీం “జెర్సీ”తో గట్టి హిట్ కొట్టేలా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus