పంచభూతాలను శాసించే ఆరవ భూతమే డబ్బు

Advertisement

‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన సత్యదేవ్ మళ్లీ కొంతకాలం గ్యాప్ అనంతరం హీరోగా నటించిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న ‘సతురంగా వెట్టై’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ గణేష్ దర్శకత్వం వహించాడు. నందిత శ్వేత కథానాయికగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు.

జనాల్ని మోసం చేసే ఓ ఘరానా మోసగాడి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై విశేషమైన అంచనాలను సృష్టించింది. సినిమా చూడాలన్న ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా సత్యదేవ్ ఇంటెన్స్ యాక్టింగ్ & డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డిసెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రంతో సత్యదేవ్ కథానాయకుడిగా చెరగని ముద్ర వేస్తాడేమో చూడాలి. ఈలోపు ఈ ట్రైలర్ ను ఒకసారి చూడండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus