మెస్మరైజింగ్ మెగా లుక్ సీక్రెట్ ఏంటంటే..!?

  • June 27, 2016 / 05:49 AM IST

“మెగా 150” సినిమా ఫస్ట్ డే షూట్ ఫోటోలు బయటకి వచ్చినప్పట్నుంచి అందరి నోట వెంట వస్తున్న మాట ఒకటే.. “చిరంజీవి అంతం అందంగా ఉన్నాడేంటి!” అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్ అందరి మతులు పోగొడుతోంది.

ఇటీవలే 60వ దశకంలోకి అడుగిడిన చిరంజీవి ఇంత అందంగా కనిపించడానికి కారణం ఆయన మొదటి కుమార్తె సుస్మిత అని తెలుస్తోంది. “శంకర్ దాదా జిందాబాద్” సినిమాకి కూడా చిరంజీవికి కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ ను సుస్మిత చేయడం గమనార్హం.

వివి.వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus