సమంత హీరోయిన్ గా మారిన వైనం తెలిస్తే షాకవుతారు !!

  • January 6, 2017 / 09:52 AM IST

అమాయకమైన మొహంతో, అభినయం నిండిన కళ్లతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కట్టి పడేసిన నటి సమంత. ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ భామ త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టబోతోంది. తక్కువకాలంలో గొప్ప విజయాలను, మంచి పేరుని సొంతం చేసుకున్న స్యామ్ అసలు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. చెన్నై లోని స్టెల్లా మేరీస్ కాలేజ్ లో సమంత డిగ్రీ చదువుతున్నప్పుడు తన స్నేహితురాలి పెళ్ళికి వెళ్లింది. అక్కడ అందిరిలా ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఆ ఫోటోలు మరుసటి రోజు పేపర్లో వచ్చింది. అలా పబ్లిష్ అయిందని ఓ షాప్ ఓనర్ చెబితే గాని చూసుకోలేదు. అతనే సమంతను వెతుక్కుంటూ వచ్చి తన బట్టల షాప్ కి పబ్లిసిటీ చేయమంటే సరదాగా చేసింది.

అది చూసిన ఓ కంపెనీ వాణిజ్య ప్రకటన లో నటించే అవకాశం ఇచ్చింది. ఆ యాడ్ చూసిన సినీ దర్శకులు తమ సినిమాల్లో చిన్న పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూసిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తాను దర్శకత్వం వహిస్తున్న ఏ మాయ చేసావే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ ని సద్వినియోగం చేసుకొని హిట్లు, ఆఫర్లు అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus