నయనతార హాలీడే ట్రిప్ వెనుక బిగ్ సీక్రెట్!

  • March 10, 2018 / 12:19 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో బిజీగా ఉంటూనే.. వీలు కుదిరినప్పుడల్లా ప్రియుడు విగ్నేష్ శివన్ ను వెంటేసుకొని అమెరికా వెళ్లిపోతోంది. మొదట రెండు సార్లు వెళ్లినప్పుడు “ఏముందిలో హాలిడే ట్రిప్ కి వెళ్ళి ఉంటారు” అనుకొన్నారందరూ. అయితే.. అస్తమానం ప్రపంచంలో వేరే ప్లేస్ లేనట్లు అమెరికా వెళ్ళడం పట్ల కొందరికి అనుమానాలు వచ్చాయి. అయితే.. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం నయనతార తన ప్రియుడు విగ్నేష్ ను వెంటేసుకొని అమెరికా వెళుతున్నది కేవలం హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే కాదు.. అక్కడి బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ చూసుకోవడం కోసం.

సినిమాల అనంతరం నయనతార పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలనుకొంటోంది. అందుకే అక్కడి హోటల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తోందట. గత కొన్నేళ్లుగా ఈ ప్రొసెస్ జరుగుతోందని, అందుకే నయనతార మాటిమాటికీ అక్కడికెళ్లోస్తోందని చెప్పుకొంటున్నారు. స్టార్ హీరోయిన్ గారికి ఆమాత్రం ప్లానింగ్ ఉండడంలో తప్పేముంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus