గురు కోసం వెంకటేష్ శ్రమించిన విధానం చెప్పిన సుధ కొంగర!

  • September 23, 2016 / 12:10 PM IST

విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం గురు.. ప్రారంభం రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆ సినిమాపై అంచనాలను పెంచారు దర్శకురాలు సుధ కొంగర. హిందీలో మాధవన్ నటించిన సాలా ఖండూస్ చిత్రాన్ని కూడా ఈమె తెరకెక్కించారు. అదే చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో రూపొందిస్తున్నారు. పోస్టర్ లో లుక్ వెనుక  వెంకటేష్ తొమ్మిది నెలల కష్టం దాగుందని ఆమె చెప్పారు. “సాలా ఖండూస్ లో మాధవన్ తన లుక్ కోసం రెండున్నర ఏళ్లు కష్టపడ్డారు.

వెంకటేష్ గారు తొమ్మిది నెలలో రప్పించారు. జనవరిలో ప్రత్యేక ట్రైనర్లతో ప్రాక్టీస్ మొదలైయింది. కొన్ని గాయాలు వల్ల ఏప్రిల్ లో బ్రేక్ పడింది. ఆయన కోలుకోగానే జూన్ నుంచి మళ్లీ మొదలెట్టి సెప్టెంబర్ వరకు కష్టపడ్డారు. వెంకటేష్ డెడికేషన్ చూసి ఆశ్చర్య పోయాను”  అని లేడీ డైరక్టర్ చెప్పారు. ఇంకా వెంకీ గురించి వివరిస్తూ “సినీ రంగంలో వెంకటేష్ కు 30 ఏళ్ళ అనుభవం ఉంది. అయినా అతను నా మాటకు విలువ ఇస్తున్నారు. కొత్త నటుడిలా నేను చెప్పే సూచనలను పాటిస్తున్నారు” అని వివరించారు.

మణి రత్నం డైరక్షన్ టీమ్ లో పనిచేసిన సుధ “గురు” చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా విశాఖ పట్నంలో తొలి షెడ్యూల్  జరుపుకుంటోంది. ఇక్కడ పూర్తి అయినా వెంటనే రెండో షెడ్యూల్ కోసం ఊటీకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus