యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లో రాచరికపు ఛాయలు అణువణువున కనిపిస్తుంటాయి. బాహుబలి సినిమా గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా.. కాదండీ… ఆయన నిజజీవితం గురించే వివరిస్తున్నాం. డార్లింగ్ నడుచుకునే విధానం, ఆలోచించే తీరు గమనిస్తే అవన్నీ నిజమనే అంటారు. తనని అభిమానించే అభిమానుల ఆరోగ్యం పాడవకూడదని ఒక బెవేరేజెస్ కంపెనీ ఇస్తానన్నా కోట్ల ఆఫర్ ని వదులుకున్న ప్రభాస్.. జూబ్లీహిల్స్ లో తన ఇంటిని ఒక రాజ మహల్ గా నిర్మించుకున్నారు.
బయట మోడ్రన్ గా కనిపించే భవనం.. లోపలికి వెళితే ఫ్యాలెస్ లో అడుగు పెట్టిన ఫీలింగ్ ఇస్తుంది. 5 బెడ్ రూమ్స్, మూడు హాల్స్ ఉన్న ఈ భవనంలో ఫ్లోర్ కి మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ వాడారు. అంతేకాదు ఇందులో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్ కూడా ఉన్నాయి. ఈ ఇంట్లో కనిపించే ఫర్నిచర్ అంతా రాయల్ లుక్ తో ఆకట్టుకుంటుంది. అన్ని వసతులున్న ఈ ఇంటి విలువ 30 కోట్లు ఉంటుందని అంచనా.