Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Advertisement

ఇండస్ట్రీలో క్రేజ్ వస్తున్న టైమ్‌లో యాక్టింగ్ గురించి కాకుండా, పర్సనల్ లైఫ్ గురించి చర్చ జరిగితే ఏ హీరోయిన్‌కైనా భయమే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ యంగ్ అండ్ పాపులర్ బ్యూటీ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే తయారైందట.

Tollywood

దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ భామ.. తన డేటింగ్ వార్తలతో కెరీర్‌కు ఎక్కడ బ్రేక్ పడుతుందో అని కలవరపడుతోందట.

రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్‌లో ఓ బడా సెలబ్రిటీ.. అందరి ముందే ఈ హీరోయిన్ పెళ్లి టాపిక్ తీసుకొచ్చి కామెంట్స్ చేశారట.ఊహించని ఈ పరిణామంతో ఆ బ్యూటీ పబ్లిక్‌గా చాలా ఇబ్బంది పడినట్లు ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె లవ్ లైఫ్ గురించే చర్చలు నడుస్తుండటంతో అమ్మడు బాగా డిస్టర్బ్ అయ్యిందని తెలుస్తోంది.ఫిల్మ్ నగర్ గుసగుసల ప్రకారం.. ఆమె ఓ రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట వాస్తవమే అయినా, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం అస్సలు లేదట.

దీనికి ఓ బలమైన కారణం ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో నిలదొక్కుకుంటూ భారీగా పారితోషికం అందుకుంటోంది. ఫ్యామిలీ లైఫ్‌స్టైల్‌ను మార్చి, ఆర్థికంగా ఒక సేఫ్ పొజిషన్‌లో సెటిల్ చేయాలన్నదే ఆమె మెయిన్ టార్గెట్.మరిన్ని సక్సెస్‌లు చూడకముందే ఇలా పెళ్లి, అఫైర్ రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయితే, టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిపోతాయని ఆమె టెన్షన్ పడుతోందట.

అందుకే ఇకపై తన వ్యక్తిగత జీవితం గురించి కాకుండా.. కేవలం సినిమాల గురించి మాత్రమే హైలైట్ అయ్యేలా చూసుకోవాలని మీడియాకు సున్నితంగా హింట్ ఇస్తోందట.

బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus