మా ఎలక్షన్స్ లో ఓటమిని దిగమింగుకోలేకపోతున్నాడు

Advertisement

అది మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సీట్ అనుకున్నాడో లేక థియేటర్లో కుర్చీ అనుకున్నాడో తెలియదు కానీ.. మార్చి 31 వరకూ తానే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అని, ఆ తేదీ తర్వాత నరేష్ ప్యానల్ ను ప్రమాణ స్వీకారం చేసుకొని అసోసియేషన్ పగ్గాలు దక్కించుకోమని ఎలక్షన్ కమీషన్ కి ఫోన్ చేశాడట శివాజీ రాజా. దాంతో షాక్ కు గురయ్యారు నరేష్ & కో. వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని మీడియాకి తెలియజేశారు.

అసలు ఎలక్షన్స్ కి వెళ్ళడం అంటేనే ప్రస్తుతం రూల్ చేస్తున్న లేదా అధికారంలో ఉన్న టీం డిసాల్వ్ అయినట్లే. ఈమాత్రం చిన్న లాజిక్ తెలియని శివాజీరాజా నరేష్ ప్యానర్ 31వ తారీఖు కంటే ముందు ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదంటూ ఏకంగా ఎలక్షన్ కమిషన్ కు ఫోన్ చేయడం అనేది హాస్యాస్పదంగా మారింది. ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ శివాజీరాజాను ఎగతాళి చేశాడు నరేష్. కెలుక్కుని మరీ నవ్వులపాలవ్వడం శివాజీరాజాకి మాత్రమే చెల్లింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus