Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Advertisement

టాలీవుడ్‌లో సహాయ నటిగా, తల్లి పాత్రల్లో ప్రగతి(Pragathi) తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక సినిమాలతో పాటు ఫిట్‌నెస్ విషయంలోనూ ఆమె ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు.

Pragathi

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసిన ఆమె.. ఓ డైరెక్టర్ వల్ల తానెంత ఇబ్బంది పడ్డానో బహిరంగంగా చెప్పుకొచ్చారు.తన సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ప్రగతి గుర్తుచేసుకున్నారు.

ఒక దర్శకుడితో పనిచేసినప్పుడు తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ షూటింగ్ తనకు నరకంలా అనిపించిందని చెప్పారు. “ఆ డైరెక్టర్ పేరు ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, షూటింగ్ మొదలైన రెండో రోజే అతనితో మళ్లీ ఎప్పటికీ పని చేయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాను. నా కెరీర్ మొత్తంలో ఇలాంటి సిట్యువేషన్ ఫేస్ చేయడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్” అని ప్రగతి ఓపెన్‌గా చెప్పారు.

సినిమాల్లో తనకు రెమ్యునరేషన్ కంటే పవర్‌ఫుల్
క్యారెక్టర్సే ముఖ్యమని ప్రగతి స్పష్టం చేశారు. పాత్ర నచ్చితే తక్కువ పారితోషికానికైనా పని చేయడానికి రెడీ అని, ఒకవేళ కథ బాగోలేకపోతే ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేస్తానని కుండబద్దలు కొట్టారు. ఇక చిన్న, పెద్ద సినిమాల మధ్య నటనలో ఎలాంటి తేడా ఉండదని, కేవలం బడ్జెట్ బట్టే ఆ రేంజ్ మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌లో 99 శాతం సినిమాలు రిలీజ్ అయ్యాయని, అదొక మంచి రికార్డ్ అని ఆనందం వ్యక్తం చేశారు.

50 ఏళ్ల వయసులోనూ పవర్ లిఫ్టింగ్‌లో మెడల్స్ సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రగతి. ఇప్పటికే ఆసియా స్థాయిలో రాణించిన ఆమె, నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడమే తన టార్గెట్ అని వెల్లడించారు. రోజూ ఎన్ని షూటింగ్స్ ఉన్నా, కనీసం రెండు, మూడు గంటలు వర్కవుట్ చేయడం తన రొటీన్ అని చెప్పారు. 90 ఏళ్ల వయసులో కూడా ఇంతే యాక్టివ్‌గా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు ప్రగతి.

‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus