ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు తో పాటూ హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదలచేయబోతున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన ‘షేడ్స్ అఫ్ సాహూ చాప్టర్ 1’ మేకింగ్ వీడియో కి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ మేకింగ్ వీడియో సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఇక త్వరలోనే మరో మేకింగ్ వీడియోని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావవిస్తున్నట్టు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం… మార్చి 3 న ఈ చిత్ర హీరోయిన్… శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు కావడంతో ‘షేడ్స్ అఫ్ సాహూ చాఫ్టర్ 2’ ను విడుదల చేయబోతున్నారట. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, మందిరా బేడీ వంటి కొందరు బాలీవుడ్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus