మొన్న జరిగిన ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో.. ఇండియా ఘన విజయం సాధించదానికి విరాట్ కోహ్లీ అజేయమైన బ్యాటింగ్ ఆర్డర్ మాత్రమే కాదు.. అనుష్కను వదిలేయడం కూడా అని యావత్ ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రకరకాల పోస్టింగులు చేసారు.
ఈ విషయమై అనుష్క శర్మ స్పందించకపోయినా.. ఆమె మాజీ ప్రియుడు విరాట్ మాత్రం వీరలెవల్లో స్పందించాడు. “దయచేసి అనుష్కను ఆడిపోసుకోకండి.
ఆమె ఎప్పుడు పాజిటివ్ సపోర్టే ఇచ్చింది” అంటూ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసాడు.
విడిపోయిన తర్వాత కూడా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి విరాట్ తీసుకొంటున్న జాగ్రత్తకు హ్యాట్సాఫ్ అంటున్నారు కొందరు నెటిజన్లు!
Shame on people for trolling @AnushkaSharma non-stop. Have some compassion. She has always only given me positivity pic.twitter.com/OBIMA2EZKu
— Virat Kohli (@imVkohli) March 28, 2016