ఒకరు భారీ చిత్రాల సీనియర్ దర్శకుడు.. మరొకరు కమర్షియల్ టచ్ ఉన్న సోషల్ ఎలిమెంట్స్ బలంగా చెప్పగల దర్శకుడు. రెండో వ్యక్తి దర్శకుడితోపాటు మంచి రచయిత కూడా. అయితే ఇద్దరికీ సరైన విజయాలు వచ్చి చాలా ఏళ్లు అయింది. రీసెంట్‌గా చేసిన సినిమా దారుణమైన పరాజయాన్ని కూడా అందుకున్నారు. మరి ఈ కారణమో, లేక ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ ఇద్దరూ కలవబోతున్నారట. ఓ స్టార్ హీరో కోసం ఈ ఇద్దరూ ఈ పని చేస్తున్నారని సమాచారం.
భారీ చిత్రాల సీనియర్ దర్శకుడు అంటే చాలా మంది శంకర్ అని ఊహిస్తారు. అవును ఆయన గురించే ఇదంతా. ఇక కమర్షియల్ టచ్ సోషల్ ఎలిమెంట్స్ అంటే మురుగుదాస్. ఈ ఇద్దరూ తమిళ, తెలుగులో భారీ విజయాలు అందుకున్నారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఇద్దరికీ విజయం దక్కడం లేదు. ఎవరి ప్రయత్నాలు ఎవరు వేసినా ఫలితం రావడం లేదు. దీంతో ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న శంకర్, మురుగుదాస్ ఇది చేస్తున్నారట.
ఇక అసలు విషయానికొస్తే.. మురుగుదాస్ దగ్గర ఓ మాస్ మసాలా, యాక్షన్ హీరో సినిమా కథ ఉంది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న మాస్ స్టార్ హీరో ఎవరైనా బాగుంటుంది అనుకుంటున్నారు. ఆ కథను శంకర్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది. మురుగుదాస్ ఎలిమెంట్స్, శంకర్ భారీ లుక్‌తో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్లు ఈ మధ్య వార్తల్లో అజిత్ కొత్త సినిమా అంటూ ఓ లిస్ట్ బయటకు వచ్చింది. అందులో శంకర్, మరుగుదాస్ ఇద్దరూ పోటీలో ఉన్నారు.
మరి ఈ ఇద్దరూ కలసి ఒకే సినిమా చేస్తారా? లేక ఇద్దరూ వేర్వేరు కథలు చెప్పి ఓకే చేయించుకుంటారా అనేది చూడాలి. చూద్దాం ఇప్పటికైనా ఇద్దరిలో ఒకరు ఈ సినిమా విషయంలో స్పందిస్తారేమో చూడాలి.