శంకర్ దర్శకత్వంలో విక్రమ్ తనయుడు..!

Advertisement

ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నేడు విలక్షణ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్. స్టార్ హీరోల వారసులు తెరపైకి వస్తున్న సమయంలో విక్రమ్ వారసుడి గురించి కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తోంది. అయితే విక్రమ్ తనయుడు ధ్రువ కృష్ణ నటించిన లఘుచిత్రం ‘గుడ్ నైట్ చార్లీ’ అది మరింత ఊపందుకుంది.’గుడ్ నైట్ చార్లీ’ చిత్రాన్ని చూసిన వారంతా ధృవ్ నటనను ఆకాశానికెత్తేస్తూ తండ్రికి తగ్గ తనయుడిని కొనియాడుతున్నారు.

దీంతో ధృవ్ ని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు కూడా మొదలెట్టారట. గతంలో తమిళ చిత్రం ‘పసంగ’ వంటి ఎన్నో సినిమాల్లో అవకాశమొచ్చినా విక్రమ్ సున్నితంగా తిరస్కరించారు. అయితే ధృవ్ కి సినిమాలంటే తండ్రిలానే చాలా ఇష్టం. ప్రస్తుతం టీనేజ్ లో వున్న ధృవ్ లండన్ లో యాక్టింగ్, డైరక్షన్ కి సంబంధించి పలు కోర్సులు చేస్తున్నాడు. ఆసక్తి రేపుతోన్న మరో విషయం ఏమిటంటే ప్రముఖ దర్శకుడు శంకర్ ధృవ్ ని వెండి తెరకు పరిచయం చేయనున్నారట. శంకర్-విక్రమ్ మధ్య మంచి అనుభందం ఉంది. గనక ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus