Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు షణ్ముఖ్ జస్వంత్. కానీ ఈ సారి శుభవార్తతో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టిని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఫిబ్రవరి 25, 2026 తేదీతో పాటు “God’s Plan Revealed” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను సర్‌ప్రైజ్ చేశాయి. సీక్రెట్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ వార్త తెలియగానే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

Shanmukh Jaswanth

కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్, ముఖ్యంగా ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ మరియు ‘సూర్య’ వంటి వెబ్ సిరీస్‌లతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించాడు. ఒక దశలో తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన షణ్ణూ, బిగ్‌బాస్ వేదికపై తన ఆటతీరు, మాటతీరుతో రన్నరప్‌గా నిలిచి మరింత ఫేమ్ అందుకున్నాడు.

అయితే బిగ్‌బాస్ షో సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు అతని వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపాయి. ఆ తర్వాత పర్సనల్, ప్రొఫెషనల్‌గా కొన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, వాటినన్నింటినీ దాటుకుని మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా మారుతున్నాడు.

ఇలాంటి సమయంలో వచ్చిన ఎంగేజ్‌మెంట్ న్యూస్ అతని అభిమానులకు డబుల్ ట్రీట్‌లా మారింది. గతాన్ని వెనక్కి చూసుకోకుండా, కొత్త ఆశలు, కొత్త బంధంతో ముందుకు సాగుతున్న షణ్ముఖ్‌కు ఫ్యాన్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus