సహజంగా సినిమా పరిశ్రమ అంటేనే కష్టాలకు పుట్టినిల్లు…సినిమా హిట్ అయితే ఎంతటి లాభాలు వస్తాయో తెలీదు కానీ, ఫ్లాప్ అయితే మాత్రం మొత్తం కొట్టుకుపోతుంది. ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలంటే సినిమా తీయడం అంటే కోట్లు కుమ్మరించి చిల్లర వేరుకోవడమే. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఇప్పుడు కష్టాల్లో చిక్కుకున్నాడు…
సర్దార్ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లే ఆయన్ని కష్టాల్లోకి నెట్టినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. ఇంతకీ ఏంటో ఆ తప్పులు అంటే…ఈ సినిమా విషయంలో మొదటి నుంచి చాలా మార్పులు జరిగాయి….దర్శకుడుగా సంపత్ నంది పనిచేసిన తరువాత అతడిని తప్పించి దర్శకుడిగా బాబీనీ తీసుకోవడం, కొంత కాలం సినిమాటోగ్రాఫర్ గా జయన్ విన్సెంట్ పనిచేసిన తరువాత అతడిని తప్పించి అతడి స్థానంలో అర్తుర్ విల్సన్ ను నియమించడంతో, కొంత కాలం ఆనంద సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన తరువాత ఆయన స్థానంలో బ్రహ్మ కడలిని నియమించడం, ఇంకా చెప్పాలి అంటే…హీరోయిన్ గా అనిషా ఆంబ్రోస్ మొదటిగా అనుకుని ఆతరువాత ఆమె స్థానంలో కాజల్ ను తీసుకోవడం. ఇలా ఇన్ని మార్పుల నడుమ వారికిచ్చిన అడ్వాన్స్ లు భారీ మొత్తంలో పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ఈ సినిమా గబ్బర్ సింగ్2 నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ గా మారే క్రమంలో జరిగిన జాప్యం…సైతం చివరకు శరత్ ను కష్టాల్లోకి నెట్టింది. ఎలా చూసుకున్న సర్దార్ విషయంలో నిర్మాత భారీగా నష్టపోయాడు అనే చెప్పవచ్చు.