ఈ ఏడాది ఘనవిజయం సాధించిన తొలి సినిమా తొలి ప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో రాశీఖన్నా పేరు మారుమోగిపోయింది. అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే మూడు షేడ్స్ ఉన్న ఈ పాత్ర మొదట మెహ్రీన్ కి వెళ్లినట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. నాని “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెహ్రీన్… తొలి చిత్రంతో అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత “మహానుభావుడు” లో మెప్పించింది. రాజా ది గ్రేట్ లో రవితేజ తో కలిసి అదరగొట్టింది.
అందుకే ఆమెను తన సినిమాలో తీసుకోవాలని వెంకీ అట్లూరి అనుకున్నారు. సంప్రదించారు కూడా. కానీ రోజురోజుకి ఆమె బరువు పెరగడం చూసి.. ఆమెను పక్కన పెట్టినట్లు సమాచారం. ఆ ఛాన్స్ ని రాశీఖన్నాను అందుకొని మంచి హిట్ ని తన ఖాతలో వేసుకుంది. తొలి ప్రేమ ఛాన్స్ఈ చేయి జారినందుకు అప్పుడు బాధపడకపోయినా.. ఆ చిత్రం సాధించిన విజయం, ఆమెకి వచ్చిన పేరు చూసి మెహ్రీన్ తెగ బాధపడుతోందంట. అందుకే అలాంటి తప్పు మరోసారి జరగకూడదని నటనతో పాటు బాడీపైన దృష్టిపెట్టినట్లు సమాచారం.