రాజశేఖర్ కూతురు ఆ బోల్డ్ క్యారెక్టర్ చేస్తుందా?

  • July 6, 2019 / 07:29 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం`దొర‌సాని`. ఇదే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతుంది రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక. ఇప్పటీకే విడుదలైన ఫస్ట్ లుక్స్,టీజర్, ట్రైలర్ తో శివాత్మిక ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయట. తన దగ్గర పనిచేస్తున్న యువ రచయితలను.. డైరెక్టర్లను చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ‘సుకుమార్ రైటింగ్స్‌’ అనే బ్యానర్ ను స్థాపించి మరీ తన శిష్యులతో సినిమాలు చేస్తున్నాడు.

ఈ బ్యానర్ లో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘కుమార్ 21F’ చిత్రం సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందట. దర్శకుడు పలనాటి సూర్య ప్రతాప్ ఈ సీక్వెల్ కోసం క‌థ ఆల్రెడీ సిద్ధం చేసేసాడట. ఈ చిత్రం కోసం శివాత్మిక‌ను తీసుకుంటే బాగుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారట. అయితే ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి శివాత్మిక అంగీకరిస్తుందా…? ఆమె ఓకే చెప్పినా జీవిత, రాజశేఖర్లు ఒప్పుకుంటారా? అనేది చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus