మళ్ళీ మెగా ఫ్యామిలీలో చీలికలు అంటూ గోల మొదలైంది!

  • September 25, 2019 / 10:50 AM IST

మొన్న అత్యంత అట్టహాసంగా జరిగిన మెగా ఈవెంట్ “సైరా నరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్”కు మెగా కుటుంబ హీరోలైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ లు అటెండ్ అయ్యి.. అల్లు అర్జున్ ఒక్కడు మిస్ కొట్టడం పెద్ద రచ్చకు దారి తీసింది. నిజానికి అల్లు అర్జున్ కూడా వచ్చి ఉంటే వేదిక నిండుగా ఉండేది. కానీ.. అతడు రాకపోవడంతో.. మెగా ఫ్యామిలీలో చీలికలు అంటూ వార్తలు రావడం మొదలైంది.

ఇలాంటి వార్తలు కొత్తేమీ కాదు.. అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” అని చెప్పినప్పట్నుంచి ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. ఇప్పుడు ఇదే తరహాలో గాసిప్పులు వెల్లువెత్తాయి. వీటన్నిటికీ అల్లు అర్జున్ ఏదో ఒక రూపంలో సమాధానం చెబుతాడాని మెగా సోర్స్ టాక్. మరి అల్లు అర్జున్ ఈ గాసిప్పు రాయుళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తాడో చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus