వింక్ బ్యూటీ పరువు మొత్తం పోయిందిగా

  • February 15, 2019 / 06:50 PM IST

సరిగ్గా ఏడాది క్రితం ఈ టైమ్ కి ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ఒక బ్రాండ్. ఆమె కన్నుగీటితే చాలు కోట్ల లైకులు, లక్షల షేర్లు, వేల కామెంట్స్. ఇదంతా చూసి ఆమె పెద్ద హీరోయిన్ అయిపోతుందనుకున్నారు అందరూ. మొదటి సినిమా విడుదలవ్వకముందే సైన్ చేసుకోవాలని కొందరు కంగారుపడితే.. ఇంకొందరు సినిమా విడుదలయ్యాక చూద్దాం ఏమవుతుందో అని వెయిట్ చేశారు. కట్ చేస్తే.. నిన్న అమ్మడు నటించిన మొదటి చిత్రం “లవర్స్ డే” విడుదలైంది. వింక్ బ్యూటీని చూడడం కోసం థియేటర్లకు వచ్చినవాళ్ళందరూ షాక్ అయ్యి షేకైపోయారు.

ఇంతకీ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే.. వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ అసలు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాదు. ఆమె సెకండ్ హీరోయిన్. కేవలం ఆ వింక్ వల్ల హైలైట్ అయ్యింది. ఇంతకీ సినిమా మొత్తానికి పెద్ద మైనస్ ఏమైనా ఉంది అంటే అది ప్రియా వారియర్ అని విశ్లేషకులు చెప్పడంతో.. ఆమెను తమ సినిమాల్లో ముందుగానే కంగారుపడి బుక్ చేసుకున్నవాళ్లు భోరుమంటుంటే.. వెయిట్ చేసిన వాళ్ళు మాత్రం మేము ఇది ముందే గెస్ చేశాం అని నవ్వుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus