మాట మార్చడంలో అక్కినేని వారి కోడలు మాస్టర్స్ డిగ్రీ పొందినట్టుంది?

  • July 8, 2019 / 02:36 PM IST

తాజాగా ‘ఓ బేబి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని వారి ఇంటి కోడలు సమంత. గత శుక్రవారం వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను దూసుకుపోతుంది. దీంతో ఆ చిత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్న సమంత అనవసరంగా వివాదంలో ఇరుక్కుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని.. అదే దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ఆ చిత్రంలో హీరో.. హీరోయిన్ ను చెంప మీదే కొట్టే సన్నివేశాల పై సందీప్ రెడ్డి వంగాని అక్కడి మీడియా వాళ్ళు ప్రశ్నించారు. దీనికి సందీప్… ‘ప్రేమికుల మధ్య ఒకరినొకరు కొట్టుకునేంత చనువు లేకపోతే అది ప్రేమే ఎలా అవుతుంది” అంటూ కామెంట్ చేసాడు. ఇప్పుడు ఆ కామెంట్లు పెద్ద దుమారాన్నే రేపాయి.

ఇక ప్రేమ గురించి, మహిళల గురించి సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ చాలా బాధ కలిగించాయని మొదట గాయని చిన్మయి ఫైర్ అయ్యింది. చిన్మయి చేసిన కామెంట్లకు సమంత కూడా మద్దతు ఇస్తూ డైరెక్టర్ సందీప్ పై కామెంట్స్ చేసింది. అయితే ‘అర్జున్ రెడ్డి’ విడుదలైనప్పుడు మాత్రం సమంత ఆ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. ‘మాట మార్చడంలో అక్కినేని కోడలు మాస్టర్స్ డిగ్రీ పొందినట్టుంది’, ‘సమంతకు ఈ టాలెంట్ కూడా ఉందా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టి ఈ అంశం పై సమంతని ట్రోల్ చేస్తున్నారు. దీని పై సమంత ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది… “సినిమా కథ నచ్చడం, కామెంట్స్ ని వ్యతిరేకించడం రెండూ ఒకటి కాదు. ‘అర్జున్ రెడ్డి’ కథ నాకు నచ్చింది. కానీ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ సందీప్ ఇలా కామెంట్స్ చేయడం నచ్చలేదు” అంటూ పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus