రజనీకాంత్….ఈ పేరు వింటే మన దేశం వాళ్లే…కాదు మరికొన్ని దేశాల వాళ్ళు కూడా అభిమానంతో ఊగిపోతారు…అయితే తమిళ హీరో అయిన రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు…అభిమాన సంఘాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు….అయితే అలాంటి రజని సినిమా వస్తుంది అంటే…అభిమానులకు ఎలాంటి అంచనాలు ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాలా…!!! ఇదిలా ఉంటే రజనీకాంత్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యలేదు…అదే క్రమంలో రజని టైమ్ అయిపోయింది అన్నారు కొందరు…అయితే రజని రేంజ్ ఏంటో…ఆయన స్టామినా ఎంతో మరోసారి చూపించడానికి వస్తుంది రోబో 2. విషయంలోకి వెళితే….తలైవార్ రజనీకాంత్….దర్శకుడు శంకర్ కలసి….ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన చిత్రం రోబో సీక్వెల్ కి ప్లాన్ వేశారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ భారీ అంచనాలతో రూపు దిద్దుకుంటున్న 2.0 చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఈ మద్య ట్విట్టర్ లో పేర్కొన్నారు శంకర్.
కాగా ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడడంతో….వాటికి తగ్గట్టుగానే బిజినెస్ పరంగా కూడా ‘2.0’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు….. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఎంతకు అమ్మారో తెలుసా??? ఒకటి కాదు రెండు కాదు…10 కాదు 100కాదు, అక్షరాల 110కోట్లు…..అవును ఈ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. అంతటి పోటీ మధ్య జీ టివి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల శాటిలైట్ రైట్స్‌ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది. రానున్న దీపావళికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సందడి చెయ్యనుంది…మొత్తంగా చూసుకుంటే….ఈ రైట్స్ విషయంలో సినిమా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.