చిరంజీవి సినిమాకి కొరటాల మరీ అలాంటి టైటిల్ పెట్టడులే

  • November 9, 2019 / 04:21 PM IST

“సైరా నరసింహారెడ్డి” విడుదలకు ముందు నుంచే అభిమానుల అంచనాలను అమాంతం పెంచేయడంతోపాటు.. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా చిరు 152. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల క్రేజీయస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. త్రిష కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర కోసం కొరటాల శివ వెతుకుతున్నాడు.

ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం రోజుకో వార్త వినిపిస్తోంది. ప్రారంభోత్సవం అనంతరం “గోవింద ఆచార్య” అనే టైటిల్ లోగోతో సహా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వచ్చేయడంతో.. చాలా మంది అది అఫీషియల్ టైటిల్ అనుకొన్నారు. అయితే.. ఇప్పుడు “గోవింద హరి గోవింద” అనే టైటిల్ వినిపిస్తోంది. మొదటి టైటిల్ కి వచ్చినంత రెస్పాన్స్ ఈ సెకండ్ టైటిల్ కి రాలేదు. ఏదో మంత్రంలా ఉంది కానీ.. సినిమా టైటిల్ లా మాత్రం లేదు అని సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. అయినా.. తాను తెరకెక్కించే సినిమా కథ-కథనాల విషయంలోనే విశేషమైన జాగ్రత్తలు తీసుకొనే కొరటాల శివ టైటిల్ విషయంలో అలాంటి బ్యాడ్ డెసిషన్ తీసుకోడులే.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus