‘ఈషా రెబ్బా గ్లామర్ షో బిగిన్స్..!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా చూడచక్కనైన రూపంతో అలాగే మంచి నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీకి కమర్షియల్ చిత్రాల్లో మాత్రం అవకాశాలు అందుకోలేకపోతుంది. అందుకు ముఖ్య కారణం… గ్లామర్ పాత్రలకు ఆమె దూరంగా ఉండడమే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఒకానొక సమయంలో ఈషా కూడా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇప్పుడున్న కుర్ర హీరోయిన్ల దాటికి తట్టుకుని నిలబడాలంటే.. అందాలు ఆరబొయ్యక తప్పదు. ‘ఈ విషయం తెలిసినప్పటికీ పాత్రకి ప్రాధాన్యత లేకుండా.. ఊరికే అలా గ్లామర్ షో చేయడం ఎందుకా…’ అని అందాల ఆరబోత చేయలేదని ఈషా చెప్పుకొచ్చింది.

అయితే తన తదుపరి సినిమా కోసం గ్లామర్ షో చేయడానికి ఈషా రెబ్బా రెడీ అయినట్టు తాజాగా బయటకొచ్చిన ఆమె ఫోటోలను చూస్తే స్పష్టమవుతుంది. ఇటీవల పాలి వెళ్ళిన మన తెలుగమ్మాయి.. అక్కడ పొట్టి పొట్టి డ్రెస్సులతో దర్శనమిచ్చింది. ఈ ఫొటోల్లో ఆమె చాలా హాట్ గా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈషా తమిళంలో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటు తెలుగులో ‘డమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తుంది. మరి ఈ ఫోటోలు.. ఆ రెండు చిత్రాల్లో దేనికి సంబందించినవో తెలియాల్సి ఉంది. ఇక ఈషా రెబ్బా ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఖుషీ అవుతుంటే…. మరికొందరు మాత్రం ‘బాలి లో బరితెగించి తిరుగుతున్న తెలుగమ్మాయి’ అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus