సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సినిమా ఆర్టిస్టుల పై నిఘా ఎక్కువగా ఉంటుంది యూజర్స్ కి.., ఏమాత్రం చిన్న బ్యాడ్ కామెంట్ చేసినా .., వాళ్ళకి ఏ మాత్రం సెలెబ్రిటీలు పెట్టే ఫోటోలు నచ్చకపోయినా.. ట్రోల్స్ కి గురవ్వడం ఖాయం. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఇలాంటి ట్రోల్స్ కి గురయ్యింది. అయితే జాన్వికి ట్రోలింగ్… ఇదే మొదటిసారి కాదు… గతంలో కూడా చాలా సార్లు తన దుస్తుల విషయంలో ట్రోలింగ్ కి గురయ్యింది. ఇప్పుడు మరోసారి నెటిజన్లకు దొరికిపోయింది జాన్వీ .
ప్రస్తుతం ఫ్యాషన్ ట్రెండ్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ లో పాల్గొంటూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే కలర్ డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ లో జాన్వీ చాలా అందంగా ఉంది కానీ ఆ హోలోగ్రఫిక్ డిజైన్ కాపీ అంటూ కొందరు ఫ్యాషన్ ప్రియులు జాన్వీని ట్రోల్ చేయడం మొదలుపెట్టేసారు.ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బాల్మెయిన్ ఫాల్ 2018 కలెక్షన్ లో ఓ మోడల్ వేసుకున్న హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ డ్రెస్ ని జాన్వీ కాపీ చేసిందంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు ఏటిజెన్లు. ఇక ఈ విషయం పై జాన్వీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది..!