‘విజయ్ దేవరకొండ’ పింక్ సూట్ పై ట్రోలింగ్..!

  • December 10, 2019 / 02:37 PM IST

విజయ్ దేవరకొండ ఇప్పుడున్న టైర్-2 హీరోల్లో నెంబర్ 1 హీరో అని చెప్పొచ్చు. యూత్ కు కనెక్ట్ అయ్యే స్టోరీలను ఎంచుకుంటూ వారిని బాగా ఆకర్షిస్తున్నాడు. ఈ ఏడాది ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో పెద్ద ప్లాప్ అందుకున్న విజయ్.. ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరో పక్క పూరి జగన్నాధ్ తెరకెక్కించే ‘ఫైటర్’ చిత్రం కోసం కూడా రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. ‘బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్’ నిర్వహించిన ఏడవ ఎడిషన్ ఫంక్షన్‌ కోసం విజయ్ ఇప్పుడు కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు విజయ్ కు దక్కింది.

ఈ క్రమంలో ఓ పింక్ షూట్ ధరించి ఫోటో షూట్లో పాల్గొన్నాడు విజయ్. తన సినిమాలో వేడుకల్లో కూడా చిత్ర, విచిత్ర మైన డ్రెస్సులతో వార్తల్లోకి ఎక్కే విజయ్. ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ వేడుకలో లుంగీలో హాజరయ్యాడు. ఆ తరువాత కూడా చాలా వింత వింత డ్రెస్సుల్లో దర్శనమిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈసారి పింక్ సూట్ ఫోటో షూట్ మాత్ర చాలా తేడా కొట్టింది. దీంతో విజయ్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. రకరకాలు గా విజయ్ ఫోటోలను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus