‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో అమాంతం స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. సినిమాలతోనే కాకుండా తన ఆటిట్యూడ్ తో ‘హార్డ్ కోర్ ఫ్యాన్స్’ ను ఏర్పాటు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఆ ఆటిట్యూడ్ ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందేమో కానీ మిగిలిన ప్రేక్షకులకి, అలాగే ఇండస్ట్రీలో కొంతమంది చిన్న హీరోలకి చిరాకు పుట్టిస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక విజయ్ సినిమాలు ప్లాప్ అయితే వారు పండగ చేసేసుకుంటారు అనే ప్రచారం కూడా ఎప్పటి నుండో జరుగుతుంది. ఈ ఏడాది ఆయన హీరోగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం డిజాస్టర్ కావడంతో అదే రీతిలో ఎంజాయ్ చేసిన వరున్నారంట.
ఇది పక్కన పెడితే.. విజయ్ ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. కె.ఎస్.రామారావు సమర్పణలో ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుండే విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో విజయ్ మొహం మీద బ్లెడ్ మరకలతో చేతిలో సిగిరెట్ తో చాలా రఫ్ లుక్ లో ఎంతో ఆవేశంతో అరుస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ లుక్ విజయ్ ఫ్యాన్స్ కు కానీ.. ప్రేక్షకులకి కానీ.. కొత్తేమీ కాదు. మొన్నొచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కూడా విజయ్ ఇటువంటి లుక్ లో కనిపించాడు. దీంతో ‘అర్జున్ రెడ్డి’ ఫీవర్ నుండీ ఇంకా బయటకి వచ్చేలా లేడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి