శ్రద్ధాదాస్ కు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చే సినిమాలు ఇప్పటివరకు రాలేదు. అన్ని సెకండ్ హీరోయిన్, ప్రత్యేక గీతాల్లోనే మెరిసింది. రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో కనిపించిన ఈ భామ మరోసారి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించబోతోంది. అసలు విషయంలోకి వస్తే.. గడ్డం గ్యాంగ్ సినిమా తరువాత రాజశేఖర్ గా విలన్ గా అవతారమెత్తనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో ఆయనొక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన పూజా కుమార్ అనే హీరోయిన్ కనిపించనుంది. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉండడంతో ప్రవీణ్ సత్తారు శ్రద్ధాదాస్ ను సంప్రదించారు. ఆమెకు పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందట. మరి ఈ సినిమాతో అయినా.. అమ్మడుకి తెలుగులో అవకాశాలు రావడం పెరుగుతాయేమో చూడాలి!